Skip to main content

Global Manufacturing Risk Index: తయారీ రిస్క్‌ సూచీ నివేదికలో రెండో స్థానంలో నిలిచిన దేశం?

తయారీకి అనువైన ప్రాంతాలపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ రూపొందించిన అంతర్జాతీయ తయారీ రిస్క్‌ సూచీ–2021(తయారీ కార్యకలాపాలకు అత్యంత ఆకర్షణీయ దేశాల జాబితా)లో చైనా అగ్రస్థానంలో నిలిచింది.
చైనా తర్వాత భారత్‌ రెండో స్థానంలో, అమెరికా మూడో స్థానంలో ఉన్నాయి. ఆగస్టు 24న విడుదలైన ఈ జాబితాను యూరప్, ఉత్తర–దక్షిణ అమెరికా, ఆసియా–పసిఫిక్‌ (ఏపీఏసీ)కి చెందిన 47 దేశాల్లో తయారీకి అనువైన ప్రాంతాలపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా రూపొందించారు. అమెరికాను వెనక్కి నెట్టి భారత్‌ రెండో స్థానానికి ఎగబాకింది. అమెరికాతో పోలిస్తే భారత్‌లో తయారీ వ్యయాల భారం తక్కువగా ఉండటం ఇందుకు దోహదపడింది.

ప్రాతిపదికగా నాలుగు అంశాలు...
తయారీని సత్వరం తిరిగి ప్రారంభించగలగడం, వ్యాపార పరిస్థితులు (కార్మికులు/నిపుణుల లభ్యత, అందుబాటులోని మార్కెట్‌), నిర్వహణ వ్యయాలు, రిస్కులు (రాజకీయ, ఆర్థిక, పర్యావరణపరమైనవి) అనే 4 అంశాలు ప్రాతిపదికగా అధ్యయనం నిర్వహించి అంతర్జాతీయ తయారీ రిస్క్‌ సూచీని రూపొందించారు. ఈ సూచీలో అమెరికా మూడో స్థానం తర్వాత కెనడా, చెక్‌ రిపబ్లిక్, ఇండొనేíసియా, లిథువేనియా, థాయ్‌లాండ్, మలేసియా, పోలాండ్‌ దేశాలు వరుస స్థానాలు దక్కించుకున్నాయి.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ రూపొందించిన అంతర్జాతీయ తయారీ రిస్క్‌ సూచీ–2021లో రెండో స్థానంలో నిలిచిన దేశం?
ఎప్పుడు : ఆగస్టు 24
ఎవరు : భారత్‌
ఎందుకు : భారత్‌లో తయారీ వ్యయాల భారం తక్కువగా ఉండటంతో...
Published date : 25 Aug 2021 07:01PM

Photo Stories