గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ఏ జిల్లాలో ఏర్పాటైంది?
Sakshi Education
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని నాగిరెడ్డిగూడ రెవెన్యూలో ఉన్న సుజాత స్కూల్ ఆవరణలో ‘గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటైంది.
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఏర్పాటు చేసిన ఈ అకాడమీని తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు నవంబర్ 2న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో త్వరలోనే 110 స్టేడియాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. భవిష్యత్తులో జ్వాల అకాడమీతో రాష్ట్ర స్పోర్‌ట్స అథారిటీ కలిసి పనిచేస్తుందన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : గుత్తా జ్వాల, తెలంగాణ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, కేటీఆర్
ఎక్కడ : నాగిరెడ్డిగూడ, మొయినాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా

Published date : 03 Nov 2020 05:59PM