గుడికో గోమాత కార్యక్రమం ఎక్కడ ప్రారంభమైంది?
Sakshi Education
టీటీడీ, తిరుపతి హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఎస్వీ గో సంరక్షణశాల ఆధ్వర్యంలో చేపట్టిన ‘గుడికో గోమాత’ కార్యక్రమం ప్రారంభమైంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఏపీ దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
ఎక్కడ : ఇంద్రకీలాద్రి, విజయవాడు, కృష్ణా జిల్లా
ఎందుకు : దేవాలయాలకు గోవులను అందజేసేందుకు
ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుతో కలిసి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి డిసెంబర్ 7న విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి ఒక గోవును అందజేశారు.
గుడికో గోమాత కార్యక్రమం-వివరాలు
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని 28 దేవాలయాల్లో ‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టు నిర్ణయించింది.
- హిందూ ధర్మ ప్రచార పరిషత్, టీటీడీ ఎస్వీ గోసంరక్షణశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
- ఏపీలోని 13 జిల్లాలు, తెలంగాణలోని పాత 10 జిల్లాల్లో... జిల్లాకు ఒక ఆలయం చొప్పున, కర్ణాటకలోని 5 దేవాలయాల్లో కలిపి మొత్తం 28 ఆలయాల్లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఏపీ దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
ఎక్కడ : ఇంద్రకీలాద్రి, విజయవాడు, కృష్ణా జిల్లా
ఎందుకు : దేవాలయాలకు గోవులను అందజేసేందుకు
Published date : 08 Dec 2020 05:30PM