గ్రిఫిత్ వర్సిటీతో ఇమ్యునోలాజికల్స్ ఒప్పందం
Sakshi Education
కరోనా వైరస్ వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధి కోసం ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ వెల్లడించింది.
పోలియో వంటి వైరస్‌ల టీకాల రూపకల్పనలో వాడిన కోడాన్ డీ–ఆప్టిమైజేషన్ టెక్నాలజీ ఉపయోగించి కరోనా వ్యాక్సిన్‌ను రూపొందించనున్నట్లు సంస్థ ఎండీ కే ఆనంద్ కుమార్ ఏప్రిల్ 7న తెలిపారు. పరిశోధన పూర్తయ్యాక భారత్‌లో దశలవారీగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు వివరించారు. జికా వైరస్ వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధి కోసం ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ ఇప్పటికే గ్రిఫిత్ యూనివర్సిటీతో కలిసి పనిచేస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్ యూనివర్సిటీతో ఒప్పందం
ఎప్పుడు : ఏప్రిల్ 7
ఎవరు : ఇండియన్ ఇమ్యునోలాజికల్స్
ఎందుకు : కరోనా వైరస్ వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధి కోసం
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్ యూనివర్సిటీతో ఒప్పందం
ఎప్పుడు : ఏప్రిల్ 7
ఎవరు : ఇండియన్ ఇమ్యునోలాజికల్స్
ఎందుకు : కరోనా వైరస్ వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధి కోసం
Published date : 08 Apr 2020 05:08PM