Skip to main content

ఎయిర్‌పోర్ట్‌ సిటీలో ఎడ్యుపోర్ట్

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు సిటీలో అద్భుతమైన విద్యాసంస్థ అందుబాటులోకి రానుంది.
Current Affairs
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ‘ఎడ్యుపోర్టు’రూపుదిద్దుకోనుంది. వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు జీఎమ్మార్‌ హైదరాబాద్‌ ఎయిరొట్రోపొలిస్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఏఎల్‌) ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ మేరకు సెయింట్‌మేరీస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీఎమ్మార్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ఉన్నతాధికారి ఒకరు ఆగస్టు 20న తెలిపారు. నగరానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా విద్య, పరిశోధనా సంస్థలను అభివృద్ధి చేసే లక్ష్యంతో జీహెచ్‌ఏఎల్‌ ఈ అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషనల్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో వినియోగంలోకి తేవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ‘ఎడ్యుపోర్ట్‌’పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో అనుసంధానమై ఉంటుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎడ్యుపోర్టు అభివృద్ధికి ప్రణాళిక రూపకల్పన
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : జీఎమ్మార్‌ హైదరాబాద్‌ ఎయిరొట్రోపొలిస్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఏఎల్‌)
ఎక్కడ :హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు సిటీ
ఎందుకు :వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు
Published date : 25 Aug 2020 05:00PM

Photo Stories