Skip to main content

ఎస్‌సీఓ విదేశాంగ మంత్రుల సమావేశం

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమావేశాల సందర్భంగా సెప్టెంబర్ 10న రష్యా రాజధాని మాస్కోలో రష్యా, భారత్, చైనా(ఆర్‌ఐసీ) విదేశాంగ మంత్రులు వరుసగా సెర్గీ లెవ్రోవ్, జైశంకర్, వాంగ్ యి సమావేశమయ్యారు.
Current Affairs
పరస్పర సహకారం, స్నేహం, విశ్వాసం స్ఫూర్తిగా త్రైపాక్షిక సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల విషయమై వారు చర్చించారు. భేటీ అనంతరం వారు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. అంతర్జాతీయంగా అభివృద్ధిదాయక శాంతి, సుస్థిరతలు నెలకొనడానికి ఈ మూడు దేశాల మధ్య త్రైపాక్షిక సహకారం ఆవశ్యకమని అందులో పేర్కొన్నారు.

చదవండి: ఎస్‌సీఓ రక్షణ మంత్రుల సమావేశానికి వేదికైన నగరం?

భారత్, చైనా విదేశాంగ మంత్రుల భేటీ
తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించే లక్ష్యంతో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సెప్టెంబర్ 10న మాస్కోలో సమావేశమయ్యారు. ప్యాంగాంగ్ సరస్సు కేంద్రంగా రెండు దేశాలు భారీగా బలగాలను మోహరించిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న 2020 మే నెల నుంచి రెండు దేశాల విదేశాంగ మంత్రులు ముఖాముఖీ భేటీ కావడం ఇదే ప్రథమం. గల్వాన్ లోయలో చోటు చేసుకున్న తీవ్ర స్థాయి ఘర్షణల సమయంలో జూన్ 17న ఇరువురు నేతలు ఫోన్‌లో చర్చలు జరిపారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : రష్యా, భారత్, చైనా(ఆర్‌ఐసీ) విదేశాంగ మంత్రుల సమావేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 10
ఎవరు : సెర్గీ లెవ్రోవ్, జైశంకర్, వాంగ్ యి
ఎక్కడ : మాస్కో, రష్యా
ఎందుకు : త్రైపాక్షిక సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల విషయమై చర్చించేందుకు
Published date : 11 Sep 2020 05:16PM

Photo Stories