ఎర్రవల్లి గ్రామానికి జాతీయ స్వచ్ఛత శక్తి అవార్డు
Sakshi Education
తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవల్లి గ్రామానికి ‘జాతీయ స్వచ్ఛత శక్తి’ అవార్డు లభించింది.
ఫిబ్రవరి 12న జరగనున్న కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి ఈ అవార్డును అందుకోనున్నారు. స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ ఎర్రవల్లి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పరిశుభ్రత పనులతో ఈ గ్రామం జాతీయ స్వచ్ఛత శక్తి అవార్డుకు ఎంపికైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దత్తత తీసుకున్న ఎర్రవల్లి గ్రామం ఇప్పటికే రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా నిలిచిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ స్వచ్ఛత శక్తి అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : ఎర్రవల్లి గ్రామం, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ స్వచ్ఛత శక్తి అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : ఎర్రవల్లి గ్రామం, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ
Published date : 09 Feb 2019 05:14PM