ఎఫ్‌ఏటీఎఫ్ బ్లాక్‌లిస్ట్‌లో పాకిస్తాన్
Sakshi Education
ఉగ్రవాదులకు నిధులు అందకుండా చూడటంలో పాకిస్తాన్ విఫలమైందంటూ ఆ దేశాన్ని ఆర్థిక చర్యల టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) ఆసియా పసిఫిక్ గ్రూప్ బ్లాక్‌లిస్టులో పెట్టింది.
ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో రెండు రోజులపాటు జరిగిన సమావేశాల్లో ఎఫ్‌ఏటీఎఫ్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాలు ఆగస్టు 23న ముగిశాయి. ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి వాటికి నిధులు అందకుండా చేయడంలో పాక్ విఫలమైందని ఎఫ్‌ఏటీఎఫ్ పేర్కొంది. పాకిస్తాన్ ఇప్పటివరకు గ్రే లిస్టులో ఉన్న విషయం విదితమే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎఫ్‌ఏటీఎఫ్ బ్లాక్‌లిస్ట్‌లో పాకిస్తాన్
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : ఆర్థిక చర్యల టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) ఆసియా పసిఫిక్ గ్రూప్
ఎందుకు : ఉగ్రవాదులకు నిధులు అందకుండా చూడటంలో పాకిస్తాన్ విఫలమైందని

Published date : 24 Aug 2019 05:40PM