ఎఫ్1 రేసు క్యాలెండర్‌లో అరంగేట్రం చేయనున్న దేశం?
Sakshi Education
ఫార్ములా వన్ (ఎఫ్1) రేసు క్యాలెండర్‌లో సౌదీ అరేబియా అరంగేట్రం చేయనుంది. 2021 ఏడాది జరిగే ఎఫ్1 సీజన్‌లో సౌదీలోని జిద్దా నగరాన్ని చేరుస్తూ ఎఫ్1 నిర్వాహకులు నవంబర్ 5న నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు సౌదీ ఆటోమొబైల్, మోటార్ సైకిల్ సమాఖ్య (ఎస్‌ఏఎమ్‌ఎఫ్)తో ఒప్పందం కుదిరినట్లు వారు తెలిపారు. కొత్తగా నిర్మించిన జిద్దా నగర శివార్లలోని ‘కార్నిక్’ వద్ద వద్ద స్ట్రీట్ ట్రాక్‌పై 2021 నవంబర్‌లో ఈ రేసును నిర్వహించనున్నారు. ఎర్ర సముద్రానికి సమాంతరంగా ఈ ట్రాక్ ఉంది.
ఇప్పటికే...
గల్ఫ్ దేశాల్లో బహ్రెయిన్, అబుదాబిలు ఇప్పటికే ఎఫ్1 సీజన్‌ల్లో ఏటా రేస్‌లకు ఆతిథ్యమిస్తూ వస్తున్నాయి. సౌదీ రాజధాని రియాద్‌లో 2030 నాటికి ఫార్ములా వన్ రేసును నిర్వహించేలా... ట్రాక్‌ను కూడా నిర్మిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021 ఏడాది ఎఫ్1 రేసు క్యాలెండర్‌లో అరంగేట్రం చేయనున్న దేశం
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : సౌదీ అరేబియా

Published date : 06 Nov 2020 06:04PM