Skip to main content

ఏపీలో వలంటీర్ల వ్యవస్థ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 15న విజయవాడలో లాంఛనంగా ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా 2.66 లక్షల మంది వలంటీర్లుగా నియమితులై బాధ్యతల్లో చేరుతున్న సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు. నవరత్నాలే కాకుండా మేనిఫెస్టోలోని ఇతర పథకాల అమలు కూడా వలంటీర్ల ద్వారానే జరుగుతుందని సీఎం చెప్పారు. వలంటీర్లే ప్రభుత్వ స్వరం లాంటివారన్నారు.

వలంటీర్ల ద్వారా బియ్యం డోర్ డెలివరీ కార్యక్రమం సెప్టెంబర్ 1 నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలవుతుందని సీఎం చెప్పారు. దీన్ని క్రమంగా విస్తరించి ఏప్రిల్ కల్లా ప్రతి జిల్లాలో బియ్యం డోర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంటి వద్దకే నేరుగా ప్రభుత్వ సేవలు అందజేసే ఉద్దేశంతో గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటుచేసింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవ స్థ ప్రారంభం
ఎప్పుడు : ఆగ స్టు 15
ఎవరు : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ఇంటి వద్దకే నేరుగా ప్రభుత్వ సేవలు అందజేసేందుకు
Published date : 16 Aug 2019 04:30PM

Photo Stories