Skip to main content

ఏపీలో జూలై 8వ తేదీన రైతు దినోత్సవం

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి జూలై 8ని ఏటా రైతు దినోత్సవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు అమరావతిలోని ప్రజావేదికలో జూన్ 24న నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. పంటల బీమా, రైతులకు వడ్డీలేని రుణం తదితరాలకు సంబంధించిన చెల్లింపుల అంశాలను ఆ రోజుకు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కూడా జూలై 8 న ప్రారంభించనున్నట్లు తెలిపారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఏటా జూలై 8వ తేదీన రైతు దినోత్సవం
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
Published date : 25 Jun 2019 06:05PM

Photo Stories