Skip to main content

ఏపీలో జస్టిస్ శివశంకర్‌రావుకు టెండర్ల బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్‌లో టెండర్ల ప్రక్రియ న్యాయ పరిశీలన బాధ్యతలను తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.
ఆయన మూడేళ్ల పాటు ఈ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్య శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ భార్గవ సెప్టెంబర్ 11న ఉత్తర్వులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల (న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం వివిధ శాఖల్లో రూ.100 కోట్లు అంతకన్నా ఎక్కువ విలువ కలిగిన పనుల వివరాలను ముందు న్యాయ పరిశీలనకు పంపుతారు.

జస్టిస్ శివశంకరరావు 1959 మార్చి 29వతేదీన తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం సకుర్రు గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా, కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎంఎల్ పూర్తి చేసిన ఆయన నాగార్జున యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ సాధించారు. 1984లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 1996లో జ్యుడీషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించిన శివశంకరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో పలు ప్రాంతాల్లో పనిచేశారు. 2013లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టు విభజన తరువాత తెలంగాణ హైకోర్టుకు ఆప్షన్ ఇచ్చారు. 2019, ఏప్రిల్ 19న ఆయన పదవీ విరమణ చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆంధ్రప్రదేశ్‌లో టెండర్ల ప్రక్రియ న్యాయ పరిశీలన బాధ్యతలు అప్పగింత
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు
Published date : 12 Sep 2019 04:02PM

Photo Stories