ఏపీ అమూల్ ప్రాజెక్టు కార్యక్రమానికి మంత్రివర్గం ఆమోదం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నవంబర్ 27న రాష్ట్ర మంత్రివర్గం వెలగపూడిలోని సచివాలయంలో సమావేశమైంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ అమూల్ ప్రాజెక్టు కార్యక్రమానికి ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : మహిళల ఆర్థిక స్వావలంబనకు
ఈ సందర్భంగా మొత్తం 22 అంశాలపై చర్చించిన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2020, డిసెంబర్‌లో 5 ప్రత్యేక పథకాలు/ కార్యక్రమాలను ప్రారంభించాలని నిర్ణయించింది.
కేబినెట్ ముఖ్య నిర్ణయాలు...
- నివర్ తుపాను బాధితులందరికీ తక్షణం రూ.500 చొప్పున పరిహారం చెల్లించాలి. 2020, డిసెంబర్ 15నాటికి పంటనష్టం అంచనాలు పూర్తి చేసి 31నాటికి రైతులకు పంట నష్ట పరిహారం పంపిణీ.
- మహిళల ఆర్థిక స్వావలంబనకు అమూల్ భాగస్వామ్యంతో చేపట్టనున్న ‘ఏపీ అమూల్’ ప్రాజెకు్ట కార్యక్రమానికి ఆమోదం. డిసెంబరు 2న ‘ఏపీ అమూల్’ ప్రాజెక్టు ప్రారంభం.
- 2019-20 ఖరీఫ్‌కు సంబంధించి పంటల బీమా మొత్తాన్ని డిసెంబరు 15న పంపిణీ చేయాలి. 2019-20 ఖరీఫ్ బీమా పరిహారం కింద రూ.1227.77 కోట్లను చెల్లించాలి.
- ‘వైఎస్సార్ - జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షణ’ పథకం కింద రూ.927 కోట్లతో సమగ్ర భూసర్వే ప్రాజెక్టు డిసెంబరు 21న ప్రారంభం.
- ‘పేదలు అందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా డిసెంబరు 25న రాష్ట్రంలో 30.60 లక్షల మంది పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ.
- ఆన్‌లైన్ జూదంపై ఉక్కుపాదం మోపేందుకు ‘ఏపీ గేమింగ్ యాక్ట్ - 1974’ చట్టాన్ని సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం శాసనసభలో బిల్లు.
- రూ.25 వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ అమూల్ ప్రాజెక్టు కార్యక్రమానికి ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : మహిళల ఆర్థిక స్వావలంబనకు
Published date : 28 Nov 2020 05:51PM