Skip to main content

ఏనుగులకు మానసిక ఒత్తిడి

ఏనుగులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) అనుబంధ సంస్థ లాకోన్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఆలయాల్లో ఊరేగింపులకు, పర్యాటకుల విహారానికి, అటవీ ఉత్పత్తుల తరలింపునకు ఏనుగులను ఎక్కువగా వాడటం వాటిని తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నట్లు వెల్లడించారు. తగిన శిక్షణ లేని మావటీల కారణంగా అవి హింసకు గురవుతున్నట్లు తెలిపారు. ఒత్తిడి పెరిగి వాటి ప్రవర్తనపై ప్రభావం పడుతోందని, సంతానోత్పత్తి సామర్థ్యం కూడా తగ్గిపోతోందని పేర్కొన్నారు. లాకోన్స్ శాస్త్రవేత్త డాక్టర్ జి.ఉమాపతి నేతృత్వంలో నిర్వహించిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ఆసియా ప్రాంతంలో 20 శాతం ఏనుగులు నిర్బంధంలో ఉన్నాయని, ఒత్తిడి కారణంగా 1993 - 2003 మధ్యకాలంలో దాదాపు 274 మందిపై ఏనుగులు దాడులు చేశాయని గణాంకాలు చెబుతున్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఏనుగులకు మానసిక ఒత్తిడి
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) అనుబంధ సంస్థ లాకోన్స్ శాస్త్రవేత్తలు
Published date : 19 Aug 2019 05:35PM

Photo Stories