ఎన్డీఆర్‌ఎఫ్‌లో మహిళా ఉద్యోగులు
Sakshi Education
విపత్తుల నిర్వహణ, సహాయక చర్యల్లో కీలకపాత్ర పోషిస్తున్న ‘నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్’(ఎన్డీఆర్‌ఎఫ్)లో మహిళలు పనిచేసేందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపింది.
ఎన్డీఆర్‌ఎఫ్ కొత్త బెటాలియన్లలో మహిళలకు చోటు కల్పించాలని 2018లో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఆమోదించినట్లు ఎన్డీఆర్‌ఎఫ్ డెరైక్టర్ జనరల్ ఎస్‌ఎన్ ప్రధాన్ సెప్టెంబర్ 19న వెల్లడించారు. ఎన్డీఆర్‌ఎఫ్ డెరైక్టర్ తెలిపిన వివరాల ప్రకారం..
- త్వరలో ఏర్పాటుకానున్న 4 కొత్త బెటాలియన్లలో నిర్దిష్ట సంఖ్యలో మహిళలు అవసరం.
- ప్రస్తుతమున్న 12 బెటాలియన్లకు అదనంగా చేరే నాలుగు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, నేషనల్ కాపిటల్ రీజన్‌లలో పనిచేస్తాయి. ఒక్కోదాంట్లో 1150 మంది సిబ్బంది ఉంటారు.
- అన్నీ సవ్యంగా సాగితే ఇంకో ఏడాదిలోపే మహిళా సిబ్బంది విధుల్లోకి చేరతారు.
Published date : 20 Sep 2019 05:39PM