Skip to main content

ఏఎఫ్‌ఐ అధ్యక్షుడిగా వరుసగా మూడో సారి ఎన్నికైన అథ్లెట్?

భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) అధ్యక్షుడిగా దిగ్గజ అథ్లెట్ ఆదిల్ సుమరివాలా వరుసగా మూడో సారి ఎన్నికయ్యారు.
Current Affairs
రెండు రోజుల పాటు జరిగిన సర్వసభ్య సమావేశంలో అక్టోబర్ 31న ఎన్నికల ప్రక్రియ ముగిసింది. సుమరివాలా వరుసగా మూడో సారి అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. 2012, 2016లలో కూడా ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఇదే మొదటిసారి...
భారత దిగ్గజ అథ్లెట్ అంజూ బాబీజార్జ్ ఏఎఫ్‌ఐ సీనియర్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై ంది. అధ్యక్షుడి తర్వాత అత్యంత కీలకమైన సీనియర్ ఉపాధ్యక్ష పదవికి ఓ మహిళ ఎన్నికవడం ఏఎఫ్‌ఐ చరిత్రలో ఇదే మొదటిసారి. గత కార్యవర్గంలో ఆమె ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా వ్యవహరించారు.

ఏపీ నుంచి ఇద్దరు...
కొత్త కార్యవర్గంలో ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ సంఘం నుంచి ఇద్దరికి చోటు దక్కింది. సంయుక్త కార్యదర్శిగా ఏవీ రాఘవేంద్ర, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా ఎ.హైమ ఎంపికయ్యారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) అధ్యక్షుడిగా ఎన్నిక
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : ఆదిల్ సుమరివాలా
Published date : 02 Nov 2020 06:02PM

Photo Stories