ఎడోబ్ ఇండియాతో నాస్కామ్ జట్టు
Sakshi Education
యూజర్ ఎక్స్‌పీరియన్స్ (యూఎక్స్) డిజైన్‌లో విద్యార్థులు, నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు ఎడోబ్ ఇండియాతో ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ జట్టు కట్టింది. ఇందుకు సంబంధించి ఆగస్టు 28న యూఎక్స్ ఫౌండేషన్ ప్రోగ్రాంను ఎడోబ్ ఇండియా, నాస్కామ్ ఆవిష్కరించాయి.
నాస్కామ్‌కు చెందిన ఫ్యూచర్‌స్కిల్స్ ప్లాట్‌ఫాంపై నమోదు చేసుకున్న మొత్తం మూడు లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్‌కు ఇది ఉచితంగా అందుబాటులో ఉంటుంది. శిక్షణ విషయంలో పరిశ్రమ భాగస్వామిగా కాగ్ని జెంట్ వ్యవహరిస్తుందని నాస్కామ్ ఫ్యూచర్‌స్కిల్స్ కో-ఆర్కిటెక్ట్ అమిత్ అగర్వాల్ తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎడోబ్ ఇండియాతో జట్టు
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్
ఎందుకు : యూజర్ ఎక్స్‌పీరియన్స్ (యూఎక్స్) డిజైన్‌లో విద్యార్థులు, నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎడోబ్ ఇండియాతో జట్టు
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్
ఎందుకు : యూజర్ ఎక్స్‌పీరియన్స్ (యూఎక్స్) డిజైన్‌లో విద్యార్థులు, నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు
Published date : 29 Aug 2020 05:33PM