ఏ కేంద్రీయ వర్సిటీకి మాజీ ప్రధాని పీవీ పేరు పెట్టనున్నారు?
ఈ మేరకు సెప్టెంబర్ 8న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని, పార్లమెంటులో ఆయన విగ్రహాన్ని పెట్టాలని, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పీవీ పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారు.
తీర్మానం ఇదే..
’తెలంగాణ బిడ్డ, దక్షిణాది నుంచి తొలిసారి ప్రధాని పదవికి ఎన్నికైన రాజనీతిజ్ఞుడు, నూతన ఆర్థిక సంస్కరణల సారథి, అరుదైన దౌత్యనీతి కోవిదుడు, బహుభాషావేత్త, దేశ ప్రగతికి ఉజ్వల దారులు నిర్మించిన మహోన్నత దార్శనికుడు, భారత రాజకీయాల్లో మేరునగధీరుడు, అసాధారణ ప్రజ్ఞాశాలి పాములపర్తి వెంకట నరసింహారావు గారికి మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకటించాలని, పార్లమెంటు ప్రాంగణంలో ఆ మహనీయుని విగ్రహాన్ని, చిత్తరువునూ ప్రతిష్టించాలని, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది’ అని సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి సూచన మేరకు శాసనసభ ప్రాంగణంలో పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
చదవండి:
యునెస్కో ద్వారా పీవీ నరసింహారావు అవార్డు
పీవీ శత జయంతి ఉత్సవాలు ప్రారంభం
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టాలని తీర్మానం
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : తెలంగాణ అసెంబ్లీ