Skip to main content

Digital Crop Survey : డిజిటల్‌ క్రాప్‌ సర్వేకు ఏపీ ఎంపిక‌

డిజిటల్‌ క్రాప్‌ సర్వే (కేంద్ర ప్రాయోజిత పథకం) పైలట్‌ ప్రాజెక్ట్‌ అమలుకు ఆంధ్రప్రదేశ్‌ సహా మ‌రో 11 రాష్ట్రాలను ఎంపిక చేశామని, ఈ పథకాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్‌ ఆహూజ తెలిపారు.
digital crop survey
digital crop survey

ఈ సందర్భంగా మనోజ్‌ ఆహూజ మాట్లాడుతూ డిజిటల్‌ క్రాప్‌ సర్వే ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ప్రారంభం కానుందని చెప్పారు. కేంద్రం తన వంతుగా రూ.47.59 కోట్లు కేటాయించిందన్నారు.ఇందుకు ఆంధ్రప్రదేశ్‌ మ్యా­చింగ్‌ గ్రాంట్‌గా 40 శాతం నిధులు సమకూరుస్తోందన్నారు☛.

 Daily Current Affairs In Telugu: 23 జూన్ 2023 క‌రెంట్ అఫైర్స్...

 రైతుల‌కు యూనిక్‌ ఐడీలు:
డిజిటల్‌ క్రాప్‌ సర్వేలో భాగంగా రైతులకు సంబంధించిన సమాచార సేకరణ, నిర్వహణతోపాటు ప్రతి రైతుకూ యూనిక్‌ ఐడీలను ఇవ్వాల్సి ఉంటుందని ఆహూజ తెలిపారు. అలాగే యూనిఫైడ్‌ ఫార్మర్‌ సరీ్వస్‌ ఇంటర్‌ ఫేస్‌ (యూఎఫ్‌ఎస్‌ఐ)ను అందుబాటులోకి తేవాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రక్రియ పూర్త­యితే వివిధ పంటలను మరింత కచ్చితత్వంతో అంచనా వేయొచ్చన్నారు

 Daily Current Affairs Short: 22 జూన్ 2023 క‌రెంట్ అఫైర్స్ ఇవే..

Published date : 23 Jun 2023 05:51PM

Photo Stories