డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
Sakshi Education
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(డీసీఐ) ఎండీ అండ్ సీఈవోగా డా.జీవైవీ విక్టర్ మార్చి 1న బాధ్యతలు స్వీకరించారు.
ఈయన 1991లో డ్రెడ్జ్ క్యాడెట్‌గా డీసీఐలో చేరి వివిధ హోదాల్లో అపార అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. క్వాలిఫైడ్ లాయర్, ఫెలో ఇన్ ఆర్బిట్రేషన్ ఇలా అనేక రంగాల్లో ప్రతిభ చాటుకున్నారు. డీసీఐ ప్రధాన కార్యాలయం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉంది.
రూ.11,870 కోట్ల ప్రాజెక్టులకు ఒప్పందాలు...
నౌకాశ్రయాల ఆధారిత అభివృద్ధిని ప్రమోట్ చేస్తున్న సాగర్‌మాల డెవలప్‌మెంట్ కంపెనీ (ఎస్‌డీసీఎల్) వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలతో 48 ఒప్పందాలు చేసుకుంది. వీటి విలువ రూ.11,870 కోట్లు అని ఎస్‌డీసీఎల్ సంస్థ ఎండీ దిలీప్ కుమార్ గుప్తా తెలిపారు. ఒప్పందాల్లో భాగంగా ఉత్పత్తి ఆధారిత గిడ్డంగుల అభివృద్ధి, ప్రత్యేక నౌకలను కార్యరూపంలోకి తీసుకురావడం, సముద్ర సంబంధ కార్యక్రమాలను చేపడతారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డీసీఐ ఎండీ అండ్ సీఈవోగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : డా.జీవైవీ విక్టర్
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

Published date : 02 Mar 2021 06:08PM