Skip to main content

దక్షిణ చైనా సముద్రంపై క్షిపణుల ప్రయోగం

చైనా నావికా విన్యాసాల్లో భాగంగా మొదటిసారిగా రెండు విమాన విధ్వంసక మిసైల్స్‌ని, దక్షిణ చైనా సముద్రంపైన ప్రయోగించింది. అమెరికా గూఢచార విమానాలు వివాదాస్పద భూభాగంలో తిరుగుతున్నాయని చైనా ఆరోపించింది.
Edu news
దక్షిణ, తూర్పు చైనా సముద్ర ప్రాంతాల్లో ఉన్న వివాదాన్ని దృష్టిలో ఉంచుకొని, చైనా ఈ ప్రాంతంలో సైనిక స్థావరాలను బలోపేతం చేసుకుంది. దక్షిణ చైనా సముద్రంపై తమకే పూర్తి అధికారాలున్నాయని బీజింగ్ పేర్కొంటుండగా, వియత్నాం, మలేషియా, పిలిప్‌పైన్‌‌స, బ్రూనే, తైవాన్‌లు విభేదిస్తున్నారుు. ఈ రెండు మిస్సైళ్లు 4 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలవు.

గల్వాన్ ఘటన దురదృష్టకరం: చైనా
తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి గల్వాన్ ప్రాంతంలో భారత్, చైనా మధ్య జూన్‌లో జరిగిన ఘర్షణలపై డ్రాగన్ దేశం విచారం వ్యక్తం చేసింది. ఆ ఘటన అత్యంత దురదృష్టకరమైనదని పేర్కొంది. అలా జరిగి ఉండాల్సింది కాదంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. చైనా, భారత్ యువత పాల్గొన్న ఒక వెబినార్‌కు ఆగస్టు 26న హాజరైన భారత్‌లో చైనా రాయబారి సన్ వీడాంగ్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.

చదవండి: ఇండో-చైనా సరిహద్దుల్లో హింసాత్మక ఘర్షణలు

క్విక్ రివ్యూ :
ఏమిటి : దక్షిణ చైనా సముద్రంపై క్షిపణుల ప్రయోగం
ఎప్పుడు : ఆగస్టు 27
ఎవరు : చైనా
ఎందుకు : చైనా నావికా విన్యాసాల్లో భాగంగా
Published date : 29 Aug 2020 11:44AM

Photo Stories