దివాలా స్మృతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Sakshi Education
డిఫాల్టయిన సంస్థల ఆస్తుల వేలం ద్వారా వచ్చే నిధుల వినియోగంపై మరింత స్పష్టతనిచ్చేలా దివాలా స్మృతి సవరణల బిల్లు (2019)కి ఆగస్టు 1న పార్లమెంటు ఆమోదముద్ర వేసింది.
ఇప్పటికే దీనికి రాజ్యసభ ఆమోదం తెలపగా.. తాజాగా లోక్‌సభలో కూడా ఆగస్టు 1న ఆమోదం లభించింది. ఈ బిల్లులోని ఏడు సెక్షన్లలో సవరణలు ప్రతిపాదించారు. వీటి ప్రకారం డిఫాల్టయిన సంస్థ ఆస్తుల వేలం ద్వారా వచ్చిన నిధులపై రుణదాతల కమిటీకి పూర్తి అధికారాలు లభించనున్నాయి.
బిల్లులోని ప్రతిపాదనలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : దివాలా స్మృతి సవరణల బిల్లు (2019)కి ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : లోక్‌సభ
బిల్లులోని ప్రతిపాదనలు
- ఐబీసీ పరిధిలోకి వచ్చిన కేసులను 330 రోజుల్లోగా పరిష్కరించాలి.
- కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) ప్రారంభమైన తర్వాత 330 రోజుల్లోగా కేసు పూర్తి కావాలి.
- రుణ పరిష్కార ప్రణాళిక ఒకసారి ఆమోదం పొందిన తర్వాత కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వివిధ అధికారిక సంస్థలు కూడా దానికి కట్టుబడి ఉండాలి.
- ఈ బిల్లు ద్వారా గృహ కొనుగోలుదారులకు మరిన్ని హక్కులు సంక్రమించనున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దివాలా స్మృతి సవరణల బిల్లు (2019)కి ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : లోక్‌సభ
Published date : 02 Aug 2019 05:13PM