దేశవ్యాప్తంగా 1,023 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
Sakshi Education
మహిళలు, చిన్నారులపై అత్యాచార కేసుల్లో వేగవంతమైన విచారణకోసం దేశవ్యాప్తంగా 1,023 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మొత్తం 1.66 లక్షలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సెప్టెంబర్ 15న తెలిపింది. ఈ ప్రత్యేక న్యాయస్థానాలు ఏడాదికి కనీసం 165 కేసులను పరిష్కరిస్తాయని వెల్లడించింది. వీటిలో 389 కోర్టులు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద నమోదైన కేసులను ప్రత్యేకంగా విచారిస్తాయని తెలిపింది. ఇందుకోసం మొత్తం రూ. 767.25 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 1,023 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : మహిళలు, చిన్నారులపై అత్యాచార కేసుల్లో వేగవంతమైన విచారణకోసం
క్విక్ రివ్యూ :
ఏమిటి : 1,023 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : మహిళలు, చిన్నారులపై అత్యాచార కేసుల్లో వేగవంతమైన విచారణకోసం
Published date : 16 Sep 2019 05:38PM