Skip to main content

దేశంలోనే తొలి కార్గో ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభం

సాధారణ ప్రయాణికుల రైలు తరహాలో నిర్ధారిత వేళల ప్రకారం నడిచే (టైంటేబుల్డ్) సరుకు రవాణా ఎక్స్‌ప్రెస్‌ను భారతీయ రైల్వే తొలిసారి పట్టాలెక్కించింది.
Edu news హైదరాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే నిర్వహించే ఈ రైలు ఆగస్టు 5న సనత్‌నగర్‌(హైదరాబాద్) స్టేషన్ నుంచి బయలుదేరింది. ప్రతి బుధవారం సనత్‌నగర్‌ స్టేషన్ లో బయలుదేరే ఈ సరుకు రవాణా రైలు శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఆదర్శ్‌నగర్‌ స్టేషన్ కు చేరుకుంటుంది. గంటకు 50 కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ సరుకు రవాణా రైలును ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా నడిపించనున్నారు.

నిర్ధారిత వేళల్లో...
సాధారణంగా ఒక రేక్ (రైలు బోగీలన్నీ కలిపి)కు సరిపడా సరుకు ఉంటేనే సరుకు రవాణా రైలును నడుపుతారు. ముందస్తు బుకింగ్స్ ఆధారంగా ఈ రైళ్లు నడుస్తుంటాయి. దానికి భిన్నంగా సరుకు ఉన్నా లేకున్నా, ప్రయాణికుల రైళ్ల తరహాలో నిర్ధారిత వేళల్లో ఈ రైలు బయలుదేరుతుంది. కనిష్టంగా 60 టన్నుల సరుకైనా బుక్‌ చేసుకునే సదుపాయం రైల్వే కల్పిచింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
దేశంలోనే తొలి కార్గో ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : దక్షిణ మధ్య రైల్వే
ఎక్కడ : సనత్ నగర్, హైదరాబాద్
Published date : 07 Aug 2020 04:00PM

Photo Stories