దేశంలో మొత్తం చిరుత పులుల సంఖ్య?
Sakshi Education
చిరుత పులులపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ రూపొందించిన నివేదిక ‘‘స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా-2018’’ను కేంద్ర పర్యావరణం, అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ 2020, డిసెంబర్ 21న న్యూఢిల్లీలో విడుదల చేశారు.
మీకు తెలుసా: దేశంలో మెత్తం ‘‘పులుల’’ సంఖ్య?
స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా-2018
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా-2018 నివేదిక విడుదల
ఎప్పుడు : డిసెంబర్ 21, 2020
ఎవరు : కేంద్ర పర్యావరణం, అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : దేశంలో చిరుత పులులకు సంబంధించిన వివరాలను తెలిపేందుకు
ఈ నివేదిక ప్రకారం... దేశంలో మొత్తం 12,852 చిరుత పులులు ఉన్నాయి. అత్యధికంగా సెంట్రల్ ఇండియా, ఈస్ట్రన్ ఘాట్లలో 8,071 చిరుతలున్నాయి. ప్రస్తుతం ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోనే చిరుతల మనుగడ కొనసాగుతోంది. మిగతా ఖండాల్లో ఇవి క్రమంగా కనుమరుగైపోయాయి.
నివేదికలోని ముఖ్యాంశాలు...
- భారత్‌లో అత్యధికంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 3,421 చిరుతలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ తర్వాత కర్ణాటక 1,783 చిరుతలతో రెండోస్థానాన్ని ఆక్రమించింది.
- సెంట్రల్ ఇండియా, ఈస్ట్రన్ ఘాట్లలో అంతర్భాగంగా ఉన్న మహారాష్ట్ర 1,690 చిరుతపులులతో తృతీయస్థానంలో నిలిచింది.
- సెంట్రల్ ఇండియా, ఈస్ట్రన్ ఘాట్ల విభాగంలోనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 492, తెలంగాణలో 334 చిరుతలున్నాయి.
- 2014లో దేశంలో దాదాపు 7,900 చిరుతలుండగా 2018 కల్లా వాటి సంఖ్య 12,852కు (దాదాపు 60 శాతం పెరుగుదల) పెరిగింది.
మీకు తెలుసా: దేశంలో మెత్తం ‘‘పులుల’’ సంఖ్య?
స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా-2018
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా-2018 నివేదిక విడుదల
ఎప్పుడు : డిసెంబర్ 21, 2020
ఎవరు : కేంద్ర పర్యావరణం, అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : దేశంలో చిరుత పులులకు సంబంధించిన వివరాలను తెలిపేందుకు
Published date : 04 Jan 2021 05:47PM