Skip to main content

దేశంలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ లేదు: కేంద్రం

క‌రోనా వైరస్‌కు సంబంధించి భారత్‌లో ఇప్పటివరకు సమూహ వ్యాప్తి(కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్‌) దశ రాలేదని కేంద్రం ప్రకటించింది.
Current Affairsఅలాంటిదేమైనా ఉంటే, ప్రజల్లో అప్రమత్తత పెంచేందుకు ముందు మీడియాకే చెప్తామని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్ ఏప్రిల్ 10న వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌ బారిన పడిన 104 మందిలో 40 మందికి ఎలాంటి ట్రావెల్‌ హిస్టరీ కానీ, పాజిటివ్‌గా తేలిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న చరిత్ర కానీ లేదని తేలిందని ఐసీఎంఆర్‌ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించగా, లవ్‌ అగర్వాల్‌ పై సమాధానం ఇచ్చారు. మరోవైపు, కోవిడ్‌–9పై సమర్ధవంతంగా పనిచేస్తుందని తేలిన హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఎగుమతి చేయాలంటూ పలు దేశాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని విదేశాంగ శాఖ పేర్కొంది. అయితే, భారత్‌కు అవసరమైన స్టాక్‌ ఉన్న తరువాత, మిగతా స్టాక్‌ను ఎగుమతి చేయాలని నిర్ణయించామని తెలిపింది.
Published date : 11 Apr 2020 06:14PM

Photo Stories