Skip to main content

దేశంలో 7500వ జన ఔషధి కేంద్రం ఎక్కడ ప్రారంభమైంది?

దేశంలో 7500వ జన ఔషధి కేంద్రం మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ఉన్న నార్త్ ఈస్ట్రన్ ఇందిరాగాంధీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్లో ప్రారంభమైంది.
Current Affairs
ఈ కేంద్రాన్ని మార్చి 7న వర్చువల్‌ విధానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి ప్రసంగించారు. పేదలు, మధ్యతరగతి వారికి జన ఔషధి కేంద్రాలు ఔషధాలను చవకగా అందిస్తున్నాయి.

ప్రధాని ప్రసంగం–ముఖ్యాంశాలు...
  • వైద్య ఖర్చును తగ్గించే దిశగా ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలతో పేదలు, సామాన్యులకు ఏటా రూ. 50 వేల మేరకు లబ్ధి చేకూరుతోంది.
  • చవకగా ఔషధాలను అందించే ఉద్యమం దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ఈ పథకాన్ని ప్రచారం చేసేందుకు మార్చ్‌ 1 నుంచి మార్చ్‌ 7 వరకు జన ఔషధి వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.
  • 75 రకాల ఆయుష్‌ ఔషధాలు జన ఔషధి కేంద్రాల్లో లభిస్తున్నాయి.
  • 75వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా 75 జిల్లాల్లో కనీసం 75 జన ఔషధి కేంద్రాలు ఏర్పాటయ్యేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలి.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : దేశంలో 7500వ జన ఔషధి కేంద్రం ప్రారంభం
ఎప్పుడు : మార్చి 7
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : నార్త్‌ ఈస్ట్రన్‌ ఇందిరాగాంధీ రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ సైన్సెస్, షిల్లాంగ్, మేఘాలయ
ఎందుకు : ప్రజలకు చవక ధరలకే ఔషధాలు అందించేందుకు
Published date : 08 Mar 2021 06:03PM

Photo Stories