దేశంలో 21 యూనికార్న్ స్టార్టప్‌లు
Sakshi Education
దేశీయంగా యూనికార్న్ హోదా పొందిన (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్గలవి) స్టార్టప్‌లు 21 ఉన్నాయి.
ఈ విషయాన్ని హురున్ గ్లోబల్ యూనికార్న్ జాబితా వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం.. భారత సంతతికి చెందిన వారు విదేశాల్లో తీర్చిదిద్దిన యూనికార్న్‌ల సంఖ్య 40కి పైగా ఉంటుందని హురున్ రిపోర్ట్ చైర్మన్ రూపర్ట్ హుగ్‌వర్ఫ్ తెలిపారు.
జాబితాలోని ముఖ్యాంశాలు..
- 21 దేశీ యూనికార్న్‌ల విలువ సుమారు 73.2 బిలియన్ డాలర్లుగా ఉంది. వీటిలో 11 సంస్థల్లో చైనాకు చెందిన ముగ్గురు ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఉన్నాయి.
- ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతీయులు స్థాపించిన యూనికార్న్‌ల విలువ 99.6 బిలియన్ డాలర్ల పైగా ఉంటుంది.
- యూనికార్న్‌ల సంఖ్యాపరంగా అమెరికా, చైనా, బ్రిటన్ తర్వాత భారత్ నాలుగో స్థానంలో ఉంది.
- చైనాతో పోలిస్తే భారత్‌లో యూనికార్న్‌ల సంఖ్య పదో వంతు మాత్రమే. చైనాలో ఏకంగా 227 స్టార్టప్‌లు ఈ హోదా సాధించాయి.
- సగటున ఒక స్టార్టప్ సంస్థ యూనికార్న్‌గా ఎదగడానికి భారత్‌లో ఏడేళ్లు పడుతోంది. అదే చైనాలో 5.5 సంవత్సరాలు, అమెరికాలో 6.5 ఏళ్లు పడుతోంది.
- చైనాకు చెందిన ఆలీబాబా 5 సంస్థల్లో, టెన్సెంట్ 3 సంస్థల్లో, డీఎస్‌టీ గ్లోబల్ 3 భారతీయ స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేశాయి.
- దేశీయంగా 21 యూనికార్న్‌లలో పేటీఎం, ఓయో రూమ్స్, బైజూస్, ఓలా క్యాబ్స్ మొదలైనవి ఉన్నాయి. 8 దిగ్గజ స్టార్టప్‌లకు కేంద్రమైన బెంగళూరు .. యూనికార్న్‌ల రాజధానిగా నిలుస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశీయంగా యూనికార్న్ హోదా పొందిన (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్గలవి) స్టార్టప్‌లు 21
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : హురున్ గ్లోబల్ యూనికార్న్ జాబితా
Published date : 05 Aug 2020 05:45PM