Skip to main content

డబ్ల్యూఈఎఫ్‌ ఆవిష్కరించిన ఇంధన సూచీలో భారత్‌ ర్యాంకు?

ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్‌తో కలిసి వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) రూపొందించిన ఇంధన సూచీ(ఎనర్జీ ట్రాన్సిషన్‌ ఇండెక్స్‌–ఈటీఐ) ఏప్రిల్‌ 21న విడుదలైంది.
Current Affairs 115 దేశాలతో రూపొందించిన ఈ సూచీలో భారత్‌ 87వ ర్యాంకు దక్కించుకుంది. ఈ సూచీలో పశ్చిమ, ఉత్తరాది యూరప్‌ దేశాలు టాప్‌ 10లో నిల్చాయి. స్వీడన్‌ అగ్రస్థానంలో ఉండగా, నార్వే (2), డెన్మార్క్‌ (3) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

మూడో వంతు భారత్, చైనాదే...
అంతర్జాతీయంగా ఇంధన డిమాండ్‌లో మూడో వంతు చైనా (68వ స్థానం), భారత్‌దే ఉంటోందని ఈటీఐ పేర్కొంది. ఇప్పటికీ బొగ్గు వినియోగం కాస్త ఎక్కువే ఉంటున్నప్పటికీ పర్యావరణహిత ఇంధనాల విషయంలో గడిచిన దశాబ్ద కాలంగా రెండు దేశాలు గణనీయమైన పురోగతి సాధించాయని వివరించింది. ఆర్థిక వృద్ధి, పర్యావరణ హితం, ఇంధన భద్రత కోణాల్లో వివిధ దేశాల ఇంధన వ్యవస్థల ప్రస్తుత పనితీరును.. మెరుగైన విధానాల వైపు మళ్లేందుకు సంసిద్ధతను ఈ నివేదికలో పరిగణనలోకి తీసుకున్నారు.
Published date : 22 Apr 2021 07:44PM

Photo Stories