Skip to main content

ద చెన్నై ఏంజిల్‌ గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వ బ్యాంక్‌?

చెన్నై ఆధారిత ఏంజిల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రూప్‌ ‘‘ద చెన్నై ఏంజిల్‌’’తో ప్రభుత్వరంగ ఇండియన్‌ బ్యాంక్‌ ఏప్రిల్‌ 22న అవగాహన ఒప్పందం(ఎంఓయూ) చేసుకుంది.
Current Affairs
ఒప్పందంలో భాగంగా... బ్యాంక్‌ తన రుణ కార్యక్రమైన ‘‘ఇండ్‌ స్ప్రింగ్‌ బోర్డ్‌’’ పథకం కింద స్టార్టప్‌ల మూలధన అవసరాల నిమిత్తం రూ.50 కోట్ల వరకు రుణ సదుపాయాన్ని కల్పించనుంది. అలాగే స్థిరాస్తులను సమకూర్చుకునేందుకు టర్మ్‌–లోన్‌లను మంజూరు చేయనుంది.

వాతావరణ సదస్సులో మోదీ...
ధరిత్రి దినోత్సవం(ఏప్రిల్‌ 22) సందర్భంగా వాతావరణ మార్పులపై అగ్రరాజ్యం అమెరికా ఏప్రిల్‌ 22న నిర్వహించిన వర్చవల్‌ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. 40 దేశాల అధినేతలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ... ప్రపంచాన్ని వణికిస్తున్న వాతావరణ మార్పులపై పోరాటానికి వేగవంతమైన పటిష్ట కార్యాచరణ అవసరమని ఉద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, తాను కలిసి ‘ఇండియా–యూఎస్‌ క్లైమేట్, క్లీన్‌ ఎనర్జీ ఎజెండా 2030 పార్ట్‌నర్‌షిప్‌’ను ప్రారంభించినట్లు తెలిపారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ద చెన్నై ఏంజిల్‌ గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వ బ్యాంక్‌?
ఎప్పుడు : ఏప్రిల్‌ 22
ఎవరు : ఇండియన్‌ బ్యాంక్‌
ఎందుకు : ఇండ్‌ స్ప్రింగ్‌ బోర్డ్‌ పథకం కింద స్టార్టప్‌ల మూలధన అవసరాల నిమిత్తం రూ.50 కోట్ల వరకు రుణ సదుపాయాన్ని కల్పించేందుకు
Published date : 23 Apr 2021 06:25PM

Photo Stories