Daily Current Affairs in Telugu: 2022, జులై 2nd కరెంట్ అఫైర్స్
Gold Import Duty Increased: పసిడికి సుంకం దిగుమతి సుంకం 10.75% నుంచి 15 శాతానికి పెంపు
బంగారం దిగుమతులపై తాజాగా సుంకాన్ని పెంచింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 10.75 శాతం నుంచి పసిడి దిగుమతుల సుంకాన్ని 15 శాతానికి చేర్చింది. తద్వారా బలపడుతున్న బంగారం దిగుమతులకు తోడు కరెంట్ ఖాతా లోటు (క్యాడ్)కు చెక్ పెట్టాలని భావిస్తోంది. దిగుమతి సుంకంలో తాజా మార్పులు జూన్ 30 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. జూన్ నెలాఖరువరకూ బంగారంపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 7.5 శాతంగా అమలు కాగా.. ప్రస్తుతం 12.5 శాతానికి పెరిగింది. దీనికి వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ 2.5 శాతం జత కలుస్తోంది. వెరసి పసిడి దిగుమతుల సుంకం 15 శాతానికి చేరింది.
GK Awards Quiz: 26వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది ఎవరు?
Pilotless Plane: పైలట్ రహిత విమానం.. ప్రయోగం విజయవంతం
సాక్షి బెంగళూరు: రక్షణ రంగ సంస్థ డీఆర్‌డీవో తన తొలి మానవ రహిత విమానాన్ని విజయవంతంగా ఎగరవేసింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్‌లో జూలై 1న ఈ పరీక్ష చేపట్టింది. పైలట్ లేకుండా ఎగిరిన ఈ విమానం ల్యాండింగ్ వరకు అన్ని పనులను స్వయంగా నిర్వహించింది. ఇది పూర్తిగా సెల్ఫ్ కంట్రోల్ డ్రైవింగ్‌తో పనిచేస్తుందన్నారు. మానవ రహిత విమానాల అభివృద్ధిలో ఇదొక గొప్ప విజయమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు.
GK Important Dates Quiz: 2022లో మదర్స్ డేను ఏ రోజున జరుపుకుంటారు?
World Bank Approves Loan: భారత్‌కు ప్రపంచ బ్యాంక్ రుణం...రూ.13.83 వేల కోట్లు
న్యూఢిల్లీ: భారత్‌కు సుమారు రూ.13,834 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఆమోదం తెలిపింది. ఇందులో సుమారు రూ.8 వేల కోట్లను ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు, మిగతా మొత్తాన్ని ప్రైవేట్ రంగాల్లో పెట్టుబడులుగా వెచ్చిస్తారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, మేఘాలయ, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, యూపీలకు ప్రాధాన్యమిస్తారు.
Ban on Single-use Plastic: సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై... నిషేధం అమల్లోకి
న్యూఢిల్లీ: సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. రీ సైక్లింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో 100 మైక్రోన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ వస్తువలన్నింటిపైనా కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేలా విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. సామాజిక మాధ్యమాలు, కాలేజీలు, స్కూళ్లలో ప్లాస్టిక్ ఎంత హానికరమో ప్రచారం చేయాలని తెలిపింది. ప్లాస్టిక్ స్టిక్స్ ఉన్న ఇయర్ బడ్స్, బెలూన్లు, ప్లాస్టిక్ జెండాలు, ప్లాస్టిక్ పుల్ల ఐస్‌క్రీమ్‌లు, ప్లేట్స్, బ్యాగ్‌లు, కప్పులు, ఫోర్కులు, స్వీటు బాక్సుల్ని చుట్టే కవర్లతో సహా వివిధ వస్తువుల్ని నిబంధనలు ఉల్లంఘించి ఈ వస్తువులు ఎవరు తయారు చేసినా, వినియోగించినా ఐదేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధించే అవకాశముంది. ఢిల్లీలో జులై 10 తర్వాత ఈ ప్లాస్టిక్ వాడితే శిక్షలు, జరిమానాలు అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
ప్రత్యామ్నాయం ఇదీ..!
ప్లాస్టిక్‌కు చౌక ప్రత్యామ్నాయాలుగా కాగితం, జనపనార, కర్ర, మట్టి, స్టీల్ తదితరాల తయారీకి చిన్న తరహా పరిశ్రమలు ఇప్పటికే శ్రీకారం చుట్టాయి. అయితే వెదురు కర్రతో చేసే వస్తువులు అన్నింటికంటే అత్యుత్తమైన ప్రత్యామ్నాయమని నిపుణులు సూచిస్తున్నారు.
GK Persons Quiz: భారతదేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు?
Green Toilet Train: దక్షిణ భారతదేశంలోనే తొలి గ్రీన్ టాయిలెట్ రైలు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న రైళ్లలో పినాకిని ఇంటర్ సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రధానమైనది. దక్షిణ భారతదేశంలోనే మొదటి గ్రీన్ టాయిలెట్లు కలిగిన రైలు ఇదే. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుంచి తమిళనాడులోని చెన్నై నగరం మధ్య ప్రతి రోజూ వేల సంఖ్యలో ప్రయాణికులను తరలిస్తున్నది. పినాకిని ఎక్స్‌ప్రెస్ సేవలు జూలై 1వ తేదీతో 30 ఏళ్లు పూర్తిచేసుకున్నాయి. 1992 జూలై ఒకటో తేదీన 2711/2712 నంబర్లతో విజయవాడ–చెన్నై మధ్య నడిచేలా పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కించారు.
ఘనంగా బర్త్‌డే వేడుకలు..
ఈ ఏడాది జూలై 1వ తేదీ నాటికి పినాకిని ఎక్స్‌ప్రెస్ రైలు 30 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా విజయవాడ ఎలక్ట్రికల్ లోకో షెడ్ (ఈఎల్‌ఎస్) సిబ్బంది ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై రైలు బయలుదేరే ముందు బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. ఈఎల్‌ఎస్ సీనియర్ డీఈఈ సీహెచ్.దినేష్‌రెడ్డి, కోచింగ్ డిపో ఆఫీసర్ ఉదయ భాస్కర్, పీఆర్‌వో నస్రత్ మండ్రూప్కర్ కేక్ కట్ చేశారు. కోచింగ్ డిపో సిబ్బందిని డీఆర్‌ఎం శివేంద్రమోహన్ ప్రత్యేకంగా అభినందించారు.
పెన్నానది గుర్తుగా పినాకినిగా నామకరణం
రాష్ట్రంలోని నెల్లూరుజిల్లా పెన్నా నది మీదుగా రాకపోకలు సాగిస్తుండడంతో ఈ రైలుకు పినాకిని అని పేరు పెట్టారు. 2010 నుంచి 12711/12712 నంబర్ల మార్పుతో ఈ రైలు నడుస్తున్నది.
24 కోచ్‌లకు పెంపు
పినాకిని ఎక్స్‌ప్రెస్ రైలులో పూర్తిగా సిట్టింగ్ సదుపాయంతో మొదట్లో 18 కోచ్‌లు ఉండేవి. ప్రయాణికుల డిమాండ్ మేరకు 24 కోచ్‌లకు పెంచారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP