Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 26th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu August 26th 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Current Affairs in Telugu August 26th 2022
Current Affairs in Telugu August 26th 2022

DRDOవో చీఫ్‌గా సమీర్‌ వి కామత్‌ 
ప్రముఖ శాస్త్రవేత్త సమీర్‌ వి కామత్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌(డీడీఆర్‌డీ) సెక్రటరీగా, డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో) చైర్మన్‌గా నియమితులయ్యారు. అదేవిధంగా, ప్రస్తుత డీఆర్‌డీవో చీఫ్‌ జి.సతీశ్‌రెడ్డిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శాస్త్రీయ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ ఆగష్టు 25 న ఆదేశాలు జారీ చేసింది. కామత్‌ డీఆర్‌డీవోలో నేవల్‌ సిస్టమ్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ విభాగానికి డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కామత్, సతీశ్‌రెడ్డిల నియామకాలను కేబినెట్‌ నియామకాల కమిటీ(ఏసీసీ) ఆమోదించిందని సిబ్బంది వ్యవహారాల శాఖ పేర్కొంది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 60 ఏళ్లు వచ్చే వరకు కామత్‌ నూతన బాధ్యతల్లో కొనసాగుతారని కూడా వివరించింది. డీఆర్‌డీవో చీఫ్‌గా జి.సతీశ్‌రెడ్డి రెండేళ్ల పదవీ కాలానికి గాను 2018లో నియమితులయ్యారు. 2020 ఆగస్ట్‌లో కేంద్రం ఆయన పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించింది. తాజాగా ఆయనకు రక్షణ శాఖ మంత్రి శాస్త్రీయ సలహాదారు బాధ్యతలు అప్పగించింది. 

Also read: Geography Important Bit Bank: భారతదేశంలో మొట్టమొదటిగా కనుగొన్న చమురు క్షేత్రం?

India Post: కొత్తగా 10,000 శాఖలు

ఇంటి వద్దకే సేవలను అందించడం లక్ష్యంగా ఇండియా పోస్ట్‌ భారీ విస్తరణ దిశగా అడుగులేస్తోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 10,000 శాఖలను తెరవనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మేరకు అనుమతి లభించిందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్స్‌ సెక్రటరీ అమన్‌ శర్మ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ నూతన శాఖలను తెరువనున్నట్టు చెప్పారు. వీటి చేరికతో మొత్తం శాఖల సంఖ్య సుమారు 1.7 లక్షలకు చేరుతుందని వెల్లడించారు. ‘పోస్టల్‌ శాఖను విస్తరించాల్సిందిగా ప్రభుత్వం కోరుతోంది. అయిదు కిలోమీటర్ల పరిధిలోనే బ్యాంకింగ్, ఆర్థిక సేవలు చేరువలో ఉండాలన్నది భావన. పోస్టాఫీసుల ఆధునీకరణకు ప్రభుత్వం రూ.5,200 కోట్లు సమకూర్చింది.  సాంకేతికత ఆధారంగా పోస్టల్, ఇతర ప్రభుత్వ సేవలు త్వరలో ఇంటి వద్దకే అందనున్నాయి.  

Also read: Babu Bindheshwari Prasad Mandal: మండల్‌ దన్నుతో ఉద్యమించాలి!

Abu Dhabi Masters Chess: విజేత అర్జున్‌

ఆద్యంతం నిలకడగా రాణించిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేశి అబుదాబి మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా అవతరించాడు. యునైటెడ్‌ అరబ్‌ ఏమిరేట్స్‌ (యూఏఈ) రాజధాని అబుదాబిలో ఆగష్టు 25 న ముగిసిన ఈ టోర్నీలో వరంగల్‌ జిల్లాకు చెందిన 18 ఏళ్ల అర్జున్‌ 7.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో అర్జున్‌ ఆరు గేముల్లో విజయం సాధించి, మరో మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో అర్జున్‌ తెల్లపావులతో ఆడుతూ 67 ఎత్తుల్లో స్పెయిన్‌ గ్రాండ్‌మాస్టర్‌ డేవిడ్‌ ఆంటోన్‌ గిజారోపై గెలుపొందాడు. భారత్‌కే చెందిన రోహిత్‌కృష్ణ, దీప్‌సేన్‌ గుప్తా, రౌనక్‌ సాధ్వాని, అలెగ్జాండర్‌ ఇందిక్‌ (సెర్బియా), వాంగ్‌ హావో (చైనా)లపై కూడా అర్జున్‌ నెగ్గాడు. ఎవగెనీ తొమాషెవ్కీ (రష్యా), జోర్డెన్‌ వాన్‌ ఫారెస్ట్‌ (నెదర్లాండ్స్‌), రాబ్సన్‌ రే (అమెరికా)లతో జరిగిన గేమ్‌లను అర్జున్‌ ‘డ్రా’ చేసుకున్నాడు. విజేతగా నిలిచిన అర్జున్‌కు 15 వేల డాలర్ల (రూ. 12 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. మాస్టర్స్‌ టోర్నీనలో మొత్తం 148 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

Also read: Guinness World Records: మాక్‌ రూథర్‌ఫర్డ్‌ వయసు 17 ఏళ్లు.. ప్రపంచం చుట్టేశాడు..

IMFలో ఈడీగా సుబ్రమణియన్‌ నియామకం 

భారత్‌ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ను భారత్‌ తరఫున అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌)లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ)గా నియమితులయ్యారు. సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆగష్టు 25 న ఈ మేరకు  ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఫైనాన్స్‌)లో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  ఉత్తర్వుల ప్రకారం, క్యాబినెట్‌ వ్యవహారాల కమిటీ సుబ్రమణియన్‌ నియామకానికి ఆమోదముద్ర వేసింది. ఆయన పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌ నుంచి ప్రారంభమవుతుంది. మూడేళ్లు లేదా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. ఐఎంఎఫ్‌ ఈడీ (భారత్‌) బాధ్యతల్లో ప్రస్తుతం ఉన్న డాక్టర్‌ సూర్జిత్‌ ఎస్‌ భల్లా అక్టోబర్‌ 31న పదవీ విరమణ పొందనున్నారు.   

Also read: Asia Cupలో భారత్‌ కోచ్‌గా VVS లక్ష్మణ్‌

Wally Adeyemo: రష్యాపై ఆంక్షలను భారత కంపెనీలు ఉల్లంఘించలేదు 

ఉక్రెయిన్‌పై దురాక్రమణకు వ్యతిరేకంగా రష్యాపై విధించిన ఆంక్షలను భారత కంపెనీలు ఏవీ ఉల్లంఘించిన ధాఖలాలు లేవని అమెరికా ట్రెజరీ డిప్యూటీ సెక్రటరీ వాలే అదేమో స్పష్టం చేశారు. భారత్‌తోపాటు అమెరికా, యూరోప్‌ సహా ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఆంక్షలను సీరియస్‌గా తీసుకుని అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఆంక్షలకు విరుద్ధంగా భారత్‌ రష్యా చమురును దిగుమతి చేసుకుని, శుద్ధి తర్వాత ఎగుమతి చేస్తోందని అమెరికా ఆందోళన చెందుతున్నట్టు RBI డిప్యూటీ గవర్నర్‌ మైకేల్‌ పాత్ర ఇటీవలే పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన అదేమో భారత్‌కు మద్దతుగా ఆగష్టు 24 న మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా, ఉక్రెయిన్‌తోపాటు ద్వైపాక్షిక అంశాలపై భారత అధికారులతో చర్చించనున్నట్టు చెప్పారు. ‘‘అమెరికా ఆధ్వర్యంలో రష్యాపై విధించిన ఆంక్షలు విస్తృతమైనవి. వీటి అంతిమ లక్ష్యం చమురు ఎగుమతుల ద్వారా రష్యాకు వచ్చే ఆదాయాన్ని తగ్గించడమే. అదే సమయంలో ఇంధన సరఫరా సజావుగా ఉండేలా చూడడం’’అని చెప్పారు. భారత కస్టమర్లు ఇంధనం కోసం ఎక్కువ చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. 

Also read: Weekly Current Affairs (International) Bitbank: 2022 ఎక్స్‌పాట్ ఇన్‌సైడర్ ర్యాంకింగ్స్ ప్రకారం భారతదేశం ర్యాంక్ ఎంత?

On online safety: 2 వేల లోన్‌ యాప్స్‌ తొలగింపు 

నిబంధనల ఉల్లంఘన, తప్పుదోవ పట్టించే సమాచారం ఇవ్వడం, వివాదాస్పద ఆఫ్‌లైన్‌ ధోరణులు తదితర అంశాల కారణంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ ఇండియా ప్లే స్టోర్‌ నుంచి 2,000 పైగా లోన్‌ యాప్స్‌ను తొలగించినట్లు టెక్‌ దిగ్గజం గూగుల్‌ సీనియర్‌ డైరెక్టర్‌ సైకత్‌ మిత్రా తెలిపారు.  

Also read: Weekly Current Affairs (Economy) Bitbank: వివా ఎంగేజ్ యాప్‌ను ప్రారంభించిన కంపెనీ ఏది?

సైబర్‌సెక్యూరిటీపై రోడ్‌షోలు.. 
ఆన్‌లైన్‌ భద్రతపై అవగాహన కల్పించే దిశగా భారత్‌లో వివిధ నగరాల్లో సైబర్‌సెక్యూరిటీ రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ గుప్తా తెలిపారు. 1,00,000 మంది డెవలపర్లకు శిక్షణ కల్పించనున్నట్లు, అలాగే డిజిటల్‌ భద్రతను ప్రోత్సహించే దిశగా వివిధ సంస్థలకు గూగుల్‌డాట్‌ఆర్గ్‌ 2 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 16 కోట్లు) నిధులు గ్రాంట్‌గా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కలెక్టివ్‌ గుడ్‌ ఫౌండేషన్, పాయింట్‌ ఆఫ్‌ వ్యూ, హెల్ప్‌ఏజ్‌ ఇండియా తదితర స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. సైబర్‌ ముప్పుల నుంచి డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు పటిష్టమైన రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు గుప్తా వివరించారు. డిజిటల్‌ లావాదేవీలను సురక్షితంగా నిర్వహించే క్రమంలో మెరుగైన విధానాలు పాటించేలా ఇంటర్నెట్‌ యూజర్లను ప్రోత్సహించే అవగాహన కార్యక్రమాన్ని కూడా వివిధ భాషల్లో గూగుల్‌ ఆవిష్కరించింది.   

Also read: Weekly Current Affairs (National) Bitbank: హర్ ఘర్ తిరంగా ప్రచారంలో పౌరులు తమ ఇళ్ల వద్ద జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఏ రోజున కోరారు?

RBI Statistics : పటిష్ట బాటన భారత్‌ ఎకానమీ..! ​​​​​​​
​​​​​​​

బ్యాంకింగ్‌ రుణ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) 14.2 శాతం నమోదయినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గణాంకాలు వెల్లడించాయి. 2021 ఇదే కాలంలో బ్యాంకింగ్‌ రుణ వృద్ధి 6 శాతం. గడచిన త్రైమాసికం (2022 జనవరి–మార్చి)లో ఈ రేటు 10.8 శాతంగా ఉంది. ఎకానమీ పురోగమన బాటలో ఉందనడానికి తాజా గణాంకాలు నిదర్శనమని నిపుణులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఆర్‌బీఐ మే నెల నుంచి ఆగస్టు వరకూ 1.40 (ప్రస్తుతం 5.40 శాతం) పెంచింది. ఇందులో జూన్‌ వరకూ పెరిగిందే 90 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం). ఈ పరిస్థితుల్లో బ్యాంకింగ్‌సైతం రుణ రేట్లను పెంచడం ప్రారంభించింది. అయినప్పటికీ పటిష్ట స్థాయిలో రుణ వృద్ధి రేటు నమోదుకావడాన్ని చూస్తే, వ్యవస్థలో డిమాండ్‌ పరిస్థితులు బాగున్నాయని స్పష్టమవుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

Also read: Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 25th కరెంట్‌ అఫైర్స్‌

‘జూన్‌ త్రైమాసిక రుణ, డిపాజిట్‌ వృద్ధి 2022’ శీర్షికన ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాలకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు

  • ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, పేమెంట్స్‌ బ్యాంకులుసహా అన్ని షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల నుంచి సమీకరించిన సమాచారం ఆధారంగా తాజా గణాంకాలు రూపొందాయి. 
  • దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విస్తృత ప్రాతిపదికన రుణ వృద్ధి  నమోదయ్యింది.  
  • గడచిన ఐదు త్రైమాసికాల్లో డిపాజిట్‌ వృద్ధి రేటు 9.5 శాతం నుంచి 10.2 శాతం శ్రేణిలో ఉంది. 
  • జూన్‌ త్రైమాసికంలోని దేశ వ్యాప్తంగా మొత్తం డిపాజిట్లలో కరెంట్, సేవింగ్‌స అకౌంట్‌ (సీఏఎస్‌ఏ) నిష్పత్తి 73.5 శాతం. గత ఏడాది ఇదే సమయంలో ఈ నిష్పత్తి 70.5 శాతం. ఒక్క మొట్రోపాలిటన్‌ బ్రాంచీల్లో ఈ నిష్పత్తి వార్షికంగా చూస్తే 84.3 శాతం నుంచి 86.2 శాతానికి పెరిగింది.

Also read: Weekly Current Affairs (Awards) Bitbank: UAE ప్రభుత్వంచే "గోల్డెన్ వీసా" పొందిన నటులు ఎవరు?

లిస్టెడ్‌ ప్రైవేటు కంపెనీల అమ్మకాలు 41 శాతం అప్‌ 
కాగా లిస్టెడ్‌ నాన్‌–ఫైనాన్స్‌ ప్రైవేటు కంపెనీల అమ్మకాలు జూన్‌ త్రైమాసికంలో 41 శాతం పెరిగి రూ.14.11 కోట్లుగా నమోదయినట్లు ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడించాయి. 2021 ఇదే కాలంలో ఈ అమ్మకాల్లో 60.6 శాతం వృద్ధి నమోదుకాగా, 2022 జనవరి–మార్చిలో ఈ రేటు 22.3 శాతంగా ఉంది.  

Also read: Weekly Current Affairs (Economy) Bitbank: వివా ఎంగేజ్ యాప్‌ను ప్రారంభించిన కంపెనీ ఏది?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 26 Aug 2022 06:14PM

Photo Stories