Skip to main content

చంద్రుడిపై కుప్పకూలిన ఇజ్రాయెల్ వ్యోమనౌక

చంద్రుడి మీద పరిశోధనకు వెళ్లిన ఇజ్రాయెల్ వ్యోమనౌక బెరీషీట్ చంద్రుడిపై కుప్పకూలింది.
చంద్రుడి ఉపరితలంపై దిగుతున్న సమయంలో స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని, ప్రధాన ఇంజన్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగిందని ఇజ్రాయెల్ అంతరిక్ష పరిశోధన సంస్థ తెలిపింది. కొన్ని ప్రైవేటు సంస్థలతో కలిసి ఇజ్రాయెల్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. చంద్రుడిపై వ్యోమనౌకను దించిన నాలుగో దేశంగా ఇజ్రాయెల్ నిలువాలని ఆశించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మాట్లాడుతూ... మొదటిసారి విఫలమైనా.. త్వరలోనే మరో ప్రయోగాన్ని నిర్వహించేందుకు సిద్ధం కావాలని శాస్త్రవేత్తలను ఆదేశించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : చంద్రుడిపై కుప్పకూలిన ఇజ్రాయెల్ వ్యోమనౌక బెరీషీట్
ఎప్పుడు : ఏప్రిల్ 12
ఎవరు : ఇజ్రాయెల్ అంతరిక్ష పరిశోధన సంస్థ
ఎందుకు : సాంకేతిక లోపం కారణంగా
Published date : 13 Apr 2019 05:01PM

Photo Stories