చీఫ్ ఎన్నికల కమిషనర్‌గా సుశీల్ చంద్ర నియామకం
Sakshi Education
ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర ఏఫ్రిల్ 12వ తేదీన చీఫ్ ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా నియమితులయ్యారని కేంద్ర న్యాయశాఖ తెలిపింది. ప్రస్తుత చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా ఏఫ్రిల్ 12వ తేదీన వైదొలగడంతో ఆ స్థానంలో సుశీల్ చంద్ర బాధ్యతలు స్వీకరించారని వివరించింది.
లోక్‌సభ ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరి 14వ తేదీన సుశీల్‌చంద్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన చీఫ్ ఎన్నికల కమిషనర్‌గా 2022 మే 14వ తేదీ వరకు కొనసాగనున్నారు. ఆయన నేతృత్వంలోనే గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది మేతో, మిగతా రాష్ట్రాల అసెంబ్లీల గడువు వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చీఫ్ ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా సుశీల్ చంద్ర నియామకం
ఎప్పుడు: ఏఫ్రిల్ 12, 2021
ఎవరు : సుశీల్ చంద్ర
క్విక్ రివ్యూ :
ఏమిటి : చీఫ్ ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా సుశీల్ చంద్ర నియామకం
ఎప్పుడు: ఏఫ్రిల్ 12, 2021
ఎవరు : సుశీల్ చంద్ర
Published date : 13 Apr 2021 05:16PM