చైనాలో మార్కెట్‌లో అల్జీమర్స్ మందు
Sakshi Education
తీవ్ర మతిమరుపు వ్యాధి అయిన అల్జీమర్స్‌ను నయం చేసేందుకు చైనాలో కొత్త మందు మార్కెట్లోకి వచ్చింది.
బ్రౌన్ ఆల్గే (శైవలం) నుంచి సంగ్రహించిన ఈ మందు.. అల్జీమర్స్ వ్యాధికి ప్రపంచంలోనే కనుగొన్న మొట్ట మొదటిదని చైనాలోని నేషనల్ మెడికల్ ప్రోడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు పేర్కొన్నారు. జీవీ-971గా పిలుస్తున్న ఈ మందుకు 2019, నవంబర్ 2న అధికారికంగా చైనా ప్రభుత్వం అనుమతులిచ్చింది. డిసెంబర్ 29 నుంచి మార్కెట్‌లోకి వచ్చింది. ఈ మందును ఏడాది పాటు వాడాలంటే ఒక రోగికి దాదాపు రూ.4 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.
మాదిరి ప్రశ్నలు
మాదిరి ప్రశ్నలు
1. క్రింది వాటిలో నిద్రను కలగజేసే ఔషధం?
1. మార్ఫిన్
2. అట్రోవిన్
3. డిజిటాలిన్
4. బ్రూసిన్
- View Answer
- సమాధానం: 1
2. మానవునిలో పైత్యరసాన్ని తాత్కాలికంగా నిల్వచేసే భాగాన్ని ఏమంటారు.
1. కాలేయం
2. క్లోమం
3. జఠర గ్రంథులు
4. పిత్తాశయం
- View Answer
- సమాధానం: 4
Published date : 02 Jan 2020 06:16PM