Skip to main content

భారత్‌లో యుహో మొబైల్స్ ప్లాంట్

స్మార్ట్‌ఫోన్ల తయారీలో ఉన్న చైనా కంపెనీ యుహో మొబైల్... భారత్‌లో తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఏప్రిల్ 17న తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లేదా హరియాణాలోని గురుగ్రామ్‌లో ఈ యూనిట్‌ను నెలకొల్పనున్నట్లు పేర్కొంది. ఈ యూనిట్‌కోసం రూ. 100 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ వంటి మార్కెట్లకు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తామని వివరించింది. యుహో కంపెనీకి ఇప్పటికే గురుగ్రామ్‌లో అసెంబ్లింగ్ యూనిట్ ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యుహో మొబైల్ ప్లాంట్ ఏర్పాటు
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎక్కడ : భారత్
Published date : 18 Apr 2019 04:38PM

Photo Stories