భారత్‌కు ఐదు వన్డేల సిరీస్
Sakshi Education
భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది.

నాలుగో వన్డే మినహా మిగతా నాలుగు మ్యాచ్‌లు గెలుచుకున్న భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌లో ఫిబ్రవరి 3న జరిగిన ఐదో వన్డేలో భారత్ 35 పరుగుల తేడాతో కివీస్‌ను ఓడించింది. ఈ సిరీస్‌లో భారత క్రికెటర్ మహామ్మద్ షమీ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. దీంతో భువనేశ్వర్, జస్‌ప్రీత్ బుమ్రా తర్వాత వన్డే సిరీస్‌లో ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం సాధించిన మూడో భారతీయ పేసర్‌గా షమీ నిలిచాడు. మరోవైపు అజహరుద్దీన్ (334)ను వెనక్కి నెట్టి భారత్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన మూడో క్రికెటర్‌గా ధోని (335) నిలిచాడు. తొలి రెండు స్థానాల్లో సచిన్ టెండూల్కర్ (463), రాహుల్ ద్రవిడ్ (340) ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐదు వన్డేల సిరీస్ విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎవరు : భారత్
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐదు వన్డేల సిరీస్ విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎవరు : భారత్
Published date : 04 Feb 2019 06:30PM