Skip to main content

భారత క్రీడాకారిణి బిపాష ఏ క్రీడలో ప్రసిద్ధి చెందినది?

జూనియర్‌ ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్లకు ఒక రజతం, రెండు కాంస్య పతకాలు లభించాయి.

రష్యాలోని వుఫా నగరంలో ఆగస్టు 19న జరిగిన మహిళల 76 కేజీల విభాగం ఫైనల్లో భారత క్రీడాకారిణి బిపాష 0–10 స్కోరు (టెక్నికల్‌ సుపిరియారిటీ)తో ప్రత్యర్థి కైలీ రెనీ వెల్కెర్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయి రజతాన్ని దక్కించుకుంది. 50 కేజీల కాంస్య పతక పోరులో సిమ్రన్‌(భారత్‌) 7–3తో నటాలియా వరకిన (బెలారస్‌)పై, 55 కేజీల విభాగంలో సితో(భారత్‌) 11–0తో మెల్డా డెర్నెక్సి (టర్కీ)పై గెలుపొంది కాంస్య పతకాలను కైవసుం చేసుకున్నారు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : జూనియర్‌ ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన భారత క్రీడాకారిణి?
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : బిపాష(76 కేజీల విభాగం)
ఎక్కడ : వుఫా, రష్యా
ఎందుకు : మహిళల 76 కేజీల విభాగం ఫైనల్లో బిపాష 0–10 స్కోరు (టెక్నికల్‌ సుపిరియారిటీ)తో ప్రత్యర్థి కైలీ రెనీ వెల్కెర్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయినందున...

Published date : 20 Aug 2021 06:33PM

Photo Stories