భారత్, అమెరికాల మధ్య 2+2 మంత్రిత్వ స్థాయి చర్చలు
Sakshi Education
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా భారత్, అమెరికాల మధ్య 2+2 మంత్రిత్వ స్థాయి చర్చలు భారత్‌లో అక్టోబర్ 27న జరగనున్నాయి.
అంతర్జాతీయ సంబంధాలు, రక్షణ, భద్రత.. తదితర రంగాల్లో ఇరుదేశాల మధ్య బంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. చర్చల్లో భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటారు. అమెరికా తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ పాల్గొంటారు. ఇరుదేశాల మధ్య ఈ మంత్రిత్వ స్థాయి చర్చలు జరగడం ఇది మూడోసారి కానుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్, అమెరికాల మధ్య 2+2 మంత్రిత్వ స్థాయి చర్చలు
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : ఎస్ జైశంకర్, రాజ్‌నాథ్ సింగ్, పాంపియో, మార్క్ ఎస్పర్
ఎక్కడ : భారత్
ఎందుకు : ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమైన లక్ష్యంగా

Published date : 22 Oct 2020 05:57PM