బ్రహ్మకుమారీస్ చీఫ్ దాదీ జానకి ఇకలేరు
Sakshi Education
మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం బ్రహ్మకుమారీస్ సంస్థాన్ చీఫ్ దాదీ జానకి (104) కన్నుమూశారు.
శ్వాస, ఉదర సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆమె రాజస్థాన్‌లోని మౌంట్ అబూలో మార్చి 27న తుదిశ్వాస విడిచారు. పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో 1916, జనవరి 1న జన్మించిన దాదీ.. 21వ ఏటనే ఆధ్యాత్మిక రంగంలోకి అడుగుపెట్టారు. ఆమె ఎంచుకున్న విభాగంలో ఉన్నత శిఖరాలను చేరుకున్నారు. 140 దేశాల్లో ఆమె స్థాపించిన సేవా కేంద్రాలు ఉన్నాయి. పారిశుద్ధ్య పరిరక్షణకు దాదీ చేసిన కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆమెను ‘స్వచ్ఛ భారత్ అభియాన్’కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన సంగతి తెలిసిందే.
Published date : 28 Mar 2020 06:13PM