బోర్డర్-గావస్కర్ ట్రోఫీ: 2020-21 విజేత?
Sakshi Education
భారత క్రికెట్ జట్టు టెస్టు క్రికెట్ చరిత్రలో మరో విజయాన్ని అందుకుంది.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ: 2020-21 విజేతగా భారత్ జట్టు నిలిచింది. ట్రోఫీ నిర్వహణలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. జనవరి 19న ముగిసిన చివరి టెస్టులో భారత్ విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ రెండింటిని గెలుచుకోగా.. ఆస్ట్రేలియా ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. మరోక మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ సిరీస్‌లో అత్యధికంగా 21 వికెట్లు పడగొట్టిన ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా) ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు.
ఈ నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టుకు అజింక్య రహానే సారథ్యం వహించగా, ఆస్ట్రేలియా జట్టుకు టిమ్ పైన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. చివరి మ్యాచ్ ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో ఉన్న బ్రిస్బేన్‌లో జరిగింది. బ్రిస్బేన్ మైదానంలో భారత జట్టుకిదే తొలి టెస్టు విజయం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బోర్డర్-గావస్కర్ ట్రోఫీ: 2020-21 విజేత
ఎప్పుడు : జనవరి 19
ఎవరు : భారత క్రికెట్ జట్టు
ఎక్కడ : ఆస్ట్రేలియా

Published date : 22 Jan 2021 04:27PM