Skip to main content

బంగ్లాదేశ్ ఓపెన్ టోర్నీ విజేతగా లక్ష్య సేన్

బంగ్లాదేశ్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ లక్ష్య సేన్ విజేతగా నిలిచాడు.
Current Affairsబంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో డిసెంబర్ 15న ముగిసిన ఈ టోర్నీ ఫైనల్లో ఉత్తరాఖండ్‌కు చెందిన 18 ఏళ్ల లక్ష్య సేన్ 22-20, 21-18తో లియోంగ్ జున్ హావో (మలేసియా)పై విజయం సాధించాడు. తాను పాల్గొన్న గత ఏడు టోర్నీలలో లక్ష్య సేన్ ఐదు టోర్నీలలో చాంపియన్‌గా నిలువడం విశేషం. బెల్జియం ఓపెన్, డచ్ ఓపెన్, సార్లార్‌లక్స్ ఓపెన్, స్కాటిష్ ఓపెన్ టోర్నీల్లో లక్ష్య సేన్ టైటిల్స్ సాధించాడు.

మరోవైపు మహిళల డబుల్స్‌లో కె.మనీషా-రితూపర్ణ (భారత్) ద్వయం... పురుషుల డబుల్స్‌లో ఎం.ఆర్.అర్జున్-ధ్రువ్ కపిల జంట రన్నరప్‌గా నిలిచాయి. ఫైనల్స్‌లో మనీషా-రితూపర్ణ జోడీ 20-22, 19-21తో తాన్ పియర్లీ కూంగ్ లీ-థినా మురళీథరన్ (మలేసియా) ద్వయం చేతిలో... అర్జున్-ధ్రువ్ జంట 19-21, 16-21తో యీ జున్ చాంగ్-కై వున్ తీ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
బంగ్లాదేశ్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేత
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : లక్ష్య సేన్
ఎక్కడ : ఢాకా, బంగ్లాదేశ్
Published date : 16 Dec 2019 05:41PM

Photo Stories