బెంగళూరులో తొలి డిటెన్షన్ సెంటర్
Sakshi Education
దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వలసదారుల కోసం కర్ణాటక ప్రభుత్వం మొట్టమొదటి నిర్బంధ కేంద్రం (డిటెన్షన్ సెంటర్)ను డిసెంబర్ 25న ప్రారంభించింది.
అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిని, గడువు తీరిన తర్వాత కూడా దేశంలో తిష్టవేసిన వారిని ఇక్కడ ఉంచుతారు. బెంగళూరుకు సమీపంలోని సొందెకొప్ప గ్రామ సమీపంలో ఈ డిటెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ విషషమై కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మైస్పందిస్తూ... ‘మన దేశంలో ఉంటూ డ్రగ్‌స దందా చేస్తున్న ఆఫ్రికన్ల కోసమే ఆ కేంద్రాన్ని తెరిచాం’ అని అన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మొట్టమొదటి నిర్బంధ కేంద్రం (డిటెన్షన్ సెంటర్) ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 25
ఎవరు : కర్ణాటక ప్రభుత్వం
ఎక్కడ : సొందెకొప్ప గ్రామం, బెంగళూరు, కర్ణాటక
క్విక్ రివ్యూ :
ఏమిటి : మొట్టమొదటి నిర్బంధ కేంద్రం (డిటెన్షన్ సెంటర్) ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 25
ఎవరు : కర్ణాటక ప్రభుత్వం
ఎక్కడ : సొందెకొప్ప గ్రామం, బెంగళూరు, కర్ణాటక
Published date : 26 Dec 2019 05:50PM