బాలికా విద్యపై మహీంద్రా, నాందీ ఫౌండేషన్ సర్వే
Sakshi Education
దేశంలో బాలికల అక్షరాస్యతపై ‘ది టీన్ ఏజ్ గర్ల్స్ (టీఏజీ)’ ప్రాజెక్టులో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, నాందీ ఫౌండేషన్ సంస్థలు దేశ వ్యాప్తంగా సర్వే నిర్వహించాయి. 2019
-20 సంవత్సరంలో దేశంలోని 600కుపైగా జిల్లాల్లో 74 వేల మంది టీనేజీ బాలికల్ని సర్వేలో భాగం చేశారు. 13 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు గల అమ్మారుుల్లో కేరళ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలు 100 శాతం అక్షరాస్యత సాధించి ముందంజలో ఉన్నాయని ఈ సర్వే వెల్లడించింది. అక్షరాస్యత శాతం పెరిగితే.. మాతా శిశు మరణాలను 50 శాతం వరకూ తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
టీఏజీ సర్వేలో వెల్లడైన అంశాలు..
ఏమిటి : దేశంలో బాలికల అక్షరాస్యతపై సర్వే
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, నాందీ ఫౌండేషన్ సంస్థలు
టీఏజీ సర్వేలో వెల్లడైన అంశాలు..
- 13 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు గల అమ్మారుుల్లో కేరళ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలు 100 శాతం అక్షరాస్యత సాధించి ముందంజలో ఉన్నాయి.
- ఏపీ బాలికల్లో 96.6 శాతం మందికి 19 ఏళ్లలోపు వివాహాలు చేయకుండా చదివిస్తుండగా.. పశ్చిమ బెంగాల్‌లో ఈ శాతం 88.9గా నమోదైంది.
- 86.6 శాతం మంది టీనేజ్ బాలికలు 21 ఏళ్ల తర్వాతే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కలిగి ఉన్నారు.
- 56.4 శాతం మంది టీనేజీ బాలికలు రుతుక్రమం సమయంలో పరిశుభ్రమైన పద్ధతులు పాటిస్తున్నారు.
- ఏపీలో 71 శాతం మంది ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షిస్తున్నారు.
ఏమిటి : దేశంలో బాలికల అక్షరాస్యతపై సర్వే
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, నాందీ ఫౌండేషన్ సంస్థలు
Published date : 17 Feb 2020 06:06PM