అవినీతి సూచిలో భారత్‌కు 78వ స్థానం
Sakshi Education
ప్రపంచ అవినీతి సూచి - కరప్షన్ పెర్‌సెప్షన్ ఇండెక్స్ (సీపీఐ)-2018లో భారత్‌కు 78వ స్థానం దక్కింది.
ఈ మేరకు 180 దేశాలతో కూడిన జాబితాను ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ జనవరి 30న విడుదల చేసింది. 100కి 41 పాయింట్ల స్కోర్‌తో భారత్ ఈ జాబితాలో 78వ స్థానం పొందింది. 88 పాయింట్ల స్కోర్‌తో డెన్మార్క్ అగ్రస్థానంలో ఉండగా, 87 పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది. 10 పాయింట్ల స్కోరుతో సోమాలియా చివరి స్థానంలో ఉంది. సిరియా, దక్షిణ సూడాన్ చెరో 13 పాయింట్లతో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నాయి. ఇక చైనా, 87వ స్థానంలో ఉంటే, పాకిస్తాన్ 117వ స్థానంలో ఉంది. 2017లో భారత్ 40 పాయింట్ల స్కోర్‌తో 81 స్థానం పొందింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరప్షన్ పెర్‌సెప్షన్ ఇండెక్స్ (సీపీఐ)లో భారత్‌కు 78వ స్థానం
ఎప్పుడు : జనవరి 30
ఎవరు : ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరప్షన్ పెర్‌సెప్షన్ ఇండెక్స్ (సీపీఐ)లో భారత్‌కు 78వ స్థానం
ఎప్పుడు : జనవరి 30
ఎవరు : ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా
Published date : 31 Jan 2019 05:38PM