అత్యుత్తమ పరిశుభ్ర నగరంగా ఇండోర్
Sakshi Education
దేశంలోనే అత్యుత్తమ పరిశుభ్ర నగరంగా మధ్యప్రదేశ్‌లో నిఇండోర్ వరుసగా మూడోసారి నిలిచింది.
ఈ మేరకు ఢిల్లీలో మార్చి 6న కార్యక్రమంలో స్వచ్ఛ సర్వేక్షణ్-2019 అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. ఈ అవార్డుల జాబితాలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అంబికాపుర్ రెండోస్థానం, కర్ణాటకకు చెందిన మైసూర్ మూడో స్థానం పొందాయి.
అవార్డుల వివరాలు
అవార్డుల వివరాలు
- అత్యంత స్వచ్ఛమైన నగరంగా ఇండోర్
- అత్యంత స్వచ్ఛమైన రాజధానిగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్
- స్వచ్ఛత కోసం పాటుపడుతున్న మొదటి మూడు రాష్ట్రాలు వరుసగా ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర
- 10లక్షల కంటే ఎక్కువ జనాభా గల నగరాల్లో స్వచ్ఛమైన నగరం(క్లీనెస్ట్ బిగ్ సిటీ)- గుజరాత్‌లోని అహ్మదాబాద్
- 3-10లక్షల జనాభా గల నగరాల్లో స్వచ్ఛ నగరం( క్లీనెస్ట్ మీడియం సిటీ)- ఉజ్జయిని
- 1-3లక్షల జనాభా గల నగరాల్లో స్వచ్ఛ నగరం(స్వచ్ఛమైన చిన్న నగరం) - న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్
- ఉత్తమ గంగా పట్టణం(బెస్ట్ గంగా టౌన్)గా ఉత్తరాఖండ్‌లోని గౌచర్
- వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద నగరంగా(ఫాస్టెస్ట్ మూవింగ్ బిగ్ సిటీ) రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్)
- ఫాస్టెస్ట్ మూవింగ్ మీడియం సిటీగా మథుర-బృందావన్
తెలుగు రాష్ట్రాలకు ఏడు అవార్డులు
స్వచ్ఛ సర్వేక్షణ్-2019 అవార్డుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు ఏడు అవార్డులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, తిరుపతి, సూళ్లూరుపేట, కావలి అవార్డుల జాబితాలో నిలవగా.. తెలంగాణ నుంచి సిద్దిపేట, సిరిసిల్ల, బోడుప్పల్ పీర్జాదిగూడ ఈ ఘనతను నిలబెట్టుకున్నాయి. స్వచ్ఛ నగరాల జాబితా కోసం జనవరి 4 నుంచి 31 వరకు కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించింది. మొత్తం 4,237 పట్టణాలు, నగరాల్లో ఈ సర్వే చేపట్టింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి :దేశంలోనే అత్యుత్తమ పరిశుభ్ర నగరం
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : ఇండోర్, మధ్యప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి :దేశంలోనే అత్యుత్తమ పరిశుభ్ర నగరం
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : ఇండోర్, మధ్యప్రదేశ్
Published date : 07 Mar 2019 06:03PM