Skip to main content

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్–2021 విజేత?

సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్... ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ తొమ్మిదోసారి చాంపియన్గా అవతరించాడు.
Current Affairs
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఫిబ్రవరి 21న జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్, డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ 7–5, 6–2, 6–2తో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ డానిల్‌ మెద్వెదేవ్‌ (రష్యా)ను ఓడించాడు. తాజా గెలుపుతో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను అత్యధికసార్లు గెల్చుకున్న ప్లేయర్‌గా తన పేరిటే ఉన్న రికార్డును జొకోవిచ్‌ సవరించాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 27 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 15 కోట్ల 71 లక్షలు), 2000 ర్యాంకింగ్‌ పాయింట్లు... రన్నరప్‌గా నిలిచిన మెద్వెదేవ్‌కు 15 లక్షల ఆస్ట్రేలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 కోట్ల 57 లక్షలు), 1200 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

గతంలో...
  • గతంలో జొకోవిచ్‌ 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020లలో ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు చాంపియన్‌గా నిలిచాడు.
  • 18వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో జొకోవిచ్‌ అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న రోజర్‌ ఫెడరర్, రఫెల్‌ నాదల్‌ (20 చొప్పున)కు చేరువయ్యాడు. జొకోవిచ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఒకసారి... వింబుల్డన్‌లో ఐదుసార్లు... యూఎస్‌ ఓపెన్‌లో మూడుసార్లు విజేతగా నిలిచాడు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పురుషులు సింగిల్స్‌–2021 విజేత?
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌
ఎక్కడ : మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
Published date : 25 Feb 2021 03:17PM

Photo Stories