ఆసియా రెజ్లింగ్‌లో భారత్‌కు మూడు స్వర్ణాలు
Sakshi Education
భారత రాజధాని నగరం న్యూఢిల్లీలో జరుగుతున్న ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్-2020లో భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు, ఒక రజతం లభించాయి.
ఫిబ్రవరి 20న జరిగిన మహిళల ఫ్రీస్టరుుల్ పోటీల్లో దివ్య కాక్రాన్ (68 కేజీలు), సరితా మోర్ (59 కేజీలు), పింకీ (55 కేజీలు) పసిడి పతకాలు సొంతం చేసుకోగా... నిర్మలా దేవి (50 కేజీలు) రజతం దక్కించుకుంది. ఫైనల్స్‌లో సరిత 3-2తో బాట్‌సెట్‌సెగ్ అల్టాంట్‌సెగ్ (మంగోలియా)పై... పింకీ 2-1తో డల్గున్ బొలోర్మా (మంగోలియా)పై గెలిచారు. నిర్మలా దేవి 2-3తో మిహో ఇగారషి (జపాన్) చేతిలో ఓడిపోరుుంది.
68 కేజీల విభాగంలో...
68 కేజీల విభాగంలో ఐదుగురు రెజ్లర్లు మాత్రమే ఉండటంతో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో పోటీలు నిర్వహించారు. దివ్య బరిలోకి దిగిన నాలుగు బౌట్‌లలోనూ గెలిచి విజేతగా అవతరించింది. ఇంతకుముందు ఆసియా చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు ఏకైక స్వర్ణం 2018లో నవ్‌జ్యోత్ కౌర్ (65 కేజీలు) రూపంలో లభించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మూడు స్వర్ణాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎవరు : దివ్య కాక్రాన్ (68 కేజీలు), సరితా మోర్ (59 కేజీలు), పింకీ (55 కేజీలు)
ఎక్కడ : న్యూఢ్లిల్లీ

Published date : 21 Feb 2020 05:59PM