ఆర్టికల్ 370 రద్దుపై ధర్మాసనం ఏర్పాటు
Sakshi Education
జమ్మూకశ్మీర్ ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు సెప్టెంబర్ 28న అయిదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.
జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఈ ధర్మాసనం 2019, అక్టోబర్ 1 నుంచి ఆర్టికల్ రద్దుకు సంబంధించి వాదనలను విచారించనుంది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎన్వీ రమణతో పాటు జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్టికల్ 370 రద్దుపై ధర్మాసనం ఏర్పాటు
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్టికల్ 370 రద్దుపై ధర్మాసనం ఏర్పాటు
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు
Published date : 30 Sep 2019 05:46PM