Skip to main content

అరకు కాఫీకి భౌగోళిక గుర్తింపు

విశాఖ జిల్లా అరకులో పండించే అరబికా రకం కాఫీకి భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్-జీఐ) హోదా లభించింది.
అరకు కాఫీతోపాటుగా కర్ణాటక, కేరళలో పండించే కాఫీ గింజలకు కూడా కేంద్రప్రభుత్వం జీఐ హోదా కల్పించింది. దీంతో 2019లో జీఐ హోదా కల్పించిన ఉత్పత్తుల సంఖ్య 14కు చేరింది. దేశంలో మొత్తం 344 ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు ఉంది.

జీఐ హోదా లభించిన ఉత్పత్తులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. వీటిని పోలిన ఉత్పత్తులను ఇతరులెవరూ విక్రయించడానికి ఉండదు. అంతేగాకుండా ఆయా ఉత్పత్తుల నాణ్యతను ధృవీకరించేందుకు కూడా ఇది తోడ్పడుతుంది. పదేళ్ల పాటు ఈ ట్యాగ్ వర్తిస్తుంది. ఆ తర్వాత దీన్ని పునరుద్ధరించుకోవచ్చు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అరకులో పండించే అరబికా రకం కాఫీకి భౌగోళిక గుర్తింపు
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : కేంద్రప్రభుత్వం
Published date : 19 Apr 2019 05:27PM

Photo Stories